కర్ణాటక మైసూరు ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా (Mysore Palace Dasara) జరిగిన దసరా ఉత్సవాలు.. అద్వితీయ జంబూ సవారీతో (Jamboo Savari Mysore) శుక్రవారం ముగిశాయి. కాగా.. రాయల్ ప్యాలెస్ మాత్రం మరో 9 రోజుల పాటు కాంతులీననుంది. పర్యటకుల కోసం ప్యాలెస్‌ను దీపకాంతులతో ముస్తాబుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM News) ఈ మేరకు ఆదేశించారు.
ఏటా వేలాది మంది ప్రజల మధ్య ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు (Karnataka Dasara Celebration) కరోనా కారణంగా ఈసారి అనేక ఆంక్షల మధ్య నిర్వహించారు. అయితే కరోనా నిబంధనలను అనుసరించి శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగించారు.
ఆకట్టుకున్న జంబూ సవారీ..
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వడయార్ వంశానికి (Wadiyar Dynasty) చెందినవారే ఉత్సవాలు నిర్వహించారు. వడియార్ వంశ.. కులదైవమైన చాముండేశ్వరి దేవిని.. ఏనుగులపై ఊరేగింపుగా ప్యాలెస్‌కు తీసుకువచ్చారు.
గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి.. అందులో చాముండి దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ (Jamboo Savari Mysore Dasara) కట్టిన ఏనుగుతోపాటు మొత్తం ఆరు గజరాజులు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.
చాముండేశ్వరి దేవిని తీసుకొస్తున్న సమయంలో ప్యాలెస్‌లోని వీధులలో కోలాహలంగా చేసిన కళా ప్రదర్శనలు.. ఆకట్టుకున్నాయి.
కర్ణాటక సీఎం (Karnataka CM) బసవరాజు బొమ్మై స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని.. ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
దసరా సందర్భంగా మైసూర్‌లో నిర్వహించే.. ఈ ఉత్సవాలను తిలకించేందుకు యావత్ కర్ణాటక (Karnataka Dasara) నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు.
ఇదీ చూడండి: Dasara Festival 2021: దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు