Viral Video: సుడిగాలి బీభత్సం.. వణికిపోయిన ఊరి జనం - సుడిగాలి బీభత్సం వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 3:33 PM IST

మధ్యప్రదేశ్​లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. షాజాపుర్​ జిల్లాలోని బోలాయి గ్రామంలో హనుమాన్​ ఆలయ సమీపంలో గురువారం ఒక్కసారిగా ఏర్పడిన సుడిగాలిని చూసి గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టోర్నడో ప్రభావంతో ఆ ప్రాంతంలో ఉన్న అనేక చెట్లు నేలకూలాయి. పంటపొలాలు సైతం దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనను ఇంకా వాతావరణ శాఖ మాత్రం ధ్రువీకరించలేదు. సాధారణంగా ఇలాంటి టోర్నడోలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన సందర్భాలూ ఉన్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.