శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం - తిరుచానూరు పద్మావతికి పలు రకాల పూలతో పుష్పయాగం
🎬 Watch Now: Feature Video
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో ఈ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారికి తొలుత స్నపన తిరుమంజనం జరిపించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకించారు. దాతలు సమర్పించిన పుష్పాలు, పత్రాలను అధికారులు, అర్చకులు ఆలయంలో ప్రదక్షణంగా తీసుకెళ్లారు. వైదికుల వేదపారాయణం నడుమ.. చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాలలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే.. వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.