వామ్మో.. అది ఆటోనా? లేక బస్సా?.. ఏకంగా 27 మందితో ఫుల్​ స్పీడ్​గా - up auto 27 members

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2022, 4:59 PM IST

27 Passengers In Auto: సాధారణంగా ఆటోలో గ్యాప్​ లేకుండా ఓ ప‌ది మంది కూర్చొని ప్ర‌యాణించ‌డం చూస్తుంటాం. కానీ, ఉత్తర్​ప్రదేశ్​లోని ఫతేపుర్​లో ఓ ఆటోలో కూర్చున్న ప్యాసింజ‌ర్ల‌ను చూసి పోలీసులు షాక‌య్యారు. 7 సీట‌ర్‌ ఆటోలో ఏకంగా 27 మంది కూర్చొని ఉండ‌గా, ఓవ‌ర్‌స్పీడ్‌తో ప్ర‌యాణిస్తున్న ఆటోను ఆపిన పోలీసుల‌కు మ‌తిపోయింది. కేవ‌లం ఏడుగురు మాత్ర‌మే ప్రయాణించే సామర్థ్యం ఉండగా ఆ డ్రైవర్.. వృద్ధులు, చిన్నారులతో సహా 27 మందిని అంగుళం కూడా గ్యాప్ లేకుండా ఎక్కించాడు. పోలీసులు వారంద‌రినీ కిందికి దింపి లెక్కించారు. అనంత‌రం డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేసి ఆటోను సీజ్​ చేశారు. రూ.11,500 జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంత‌మందితో ఆ ఆటో ఓవ‌ర్‌స్పీడ్​లో వెళ్తోందంటే దీన్ని గిన్నిస్‌బుక్​లో ఎక్కించాల్సేందేన‌ని నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.