ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడ్ని నూతిలో వేలాడదీసి విచారణ - minor punished in mp for phone theft

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2022, 1:44 PM IST

దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ బాలుడ్ని బావిలో వేలాడతీసి తాలిబన్ల తరహాలో శిక్షించాడు ఓ యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఛతర్​పుర్​లో జరిగింది. లవ్‌కుశ్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్కోహన్​లో సెల్​ఫోన్​ దొంగలించాడన్న ఆరోపణతో నిండా నీళ్లు ఉన్న బావిలో బాలుడ్ని వేలాడతీసి, అతడ్ని విచారించాడు ఓ యువకుడు. తాను ఎలాంటి దొంగతనం చేయలేదని బాలుడు రోదిస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇదంతా మరో యువకుడు చాటుగా నిల్చుని వీడియో తీశాడు. సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించగా, వారు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో వైరల్ కాగా.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీడియో తీసిన యువకుడ్ని చితకబాదారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.