వైరల్​ వీడియో.. వ్యాన్​ను ఢీకొట్టిన బైక్​.. ఎగిరి మరో వాహనంపై తల్లీకుమారుడు - వైరల్​ వీడియా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2022, 4:30 PM IST

Updated : Apr 30, 2022, 5:24 PM IST

హరియాణాలోని ఫతేబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బైక్​ ఓ వ్యాన్​ను ఢీకొంది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపైన ప్రయాణిస్తున్న వారు ఎగిరి అటుగా వస్తున్న వాహనంపై పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గులర్వాల్​ గ్రామానికి చెందిన విజయ్​ అతని తల్లితో కలిసి పనిమీద ఫతేబాద్​కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. జన్డలీ ఖుర్జ్​ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి.
Last Updated : Apr 30, 2022, 5:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.