నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది - Older Couple saved from floods

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2022, 11:04 PM IST

తమిళనాడు ధర్మపురిలో ఓ వృద్ధ జంట కావేరి నదిలో చిక్కుకుపోయింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో వాళ్లను రక్షించారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాం గేట్లు ఎత్తివేయడం వల్ల కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నది తీరంలోని ఓ ఆలయంలో నివసిస్తున్న వృద్ధ దంపతులు నదిలో చిక్కుకున్నారు. ఇప్పటికే నదీ తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.