జవాన్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రోడ్డుపైనే హైడ్రామా!
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్.. హరిద్వార్‌లోని దెహ్రదూన్ జాతీయ రహదారిపై గంటకుపైగా హైఓల్టేజ్ డ్రామా నడిచింది. ఆర్మీసిబ్బంది, పోలీసులు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడం వల్ల వివాదం మొదలైంది. ఎస్ఐ అనిల్.. కోర్టుకు వెళ్లి వస్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ.. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్‌స్టేషన్‌కు రమ్మని చెప్పడం వల్ల ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎస్ఐ తెలిపారు.