వైకాపా ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో.. ఎన్నెన్నో అనుమానాలు - debate on attacks on sc and st background people
🎬 Watch Now: Feature Video
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుట్టిన రోజు పార్టీ కోసమని తీసుకుని వెళ్లిన వ్యక్తి.. శవమై తిరిగి వచ్చాడు. ఎమ్మెల్సీనే ఆ హత్య చేశారని బాధితుడి భార్య ఆరోపిస్తున్నారు. కాదు.. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే తనకారులోనే తీసుకుని వచ్చా అని సదరు ఎమ్మెల్సీ అంటున్నారు. అసలు అలాంటి రోడ్డు ప్రమాదమే జరగలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి అని కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు.. నివేదికలు రాగానే పూర్తిస్థాయి విచారణ అంటున్నా రు. ఈ కథలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు! కాకినాడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన డ్రైవర్ సుబ్రమణ్యం కేసు కలకలం ఇది. ఈ సందర్భంగానే తరచు ఎస్సీలపై జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు దళితసంఘాల ప్రతినిధులు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని...