చుట్టూ వరద.. మధ్యలో ఏనుగుపై మావటి.. చివరకు... - elephant swimming video
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15821062-930-15821062-1657787293625.jpg)
మావటితో సహా గంగానది ప్రవాహంలో చిక్కుకున్న ఏనుగు ధైర్యంగా తమ ప్రాణాలు
కాపాడుకున్న ఘటన బిహార్‌లో జరిగింది. వైశాలీ జిల్లాలోని రాఘోపూర్ వద్ద వంతెన లేకపోవడం వల్ల ప్రజలు నది దాటేందుకు పడవలు ఉపయోగిస్తున్నారు. మావటి హఫీజ్ తన వద్ద ఉన్న గజరాజుతో సహా పడవ ఎక్కేందుకు డబ్బు లేక ఏనుగుతో కలిసి నది దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వరద ఉద్ధృతి పెరిగి గజరాజుతో సహా కొంతదూరం కొట్టుకుపోయాడు. అయినా భయపడని ఏనుగు దాదాపు కిలోమీటరు మేర నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. మావటి సైతం ప్రాణాలతో బయటపడ్డాడు.