ఆకతాయిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ.. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. - Woman beats Romeo in public
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. సూరత్‌లోని గోడాదరా ప్రాంతంలోనూ ఇలాగే ఓ వ్యక్తి కొన్నిరోజులుగా కొందరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం.. సారాజాహేర్ మార్గంలో ఇలాగే చేస్తుండగా.. ఓ మహిళ అతడికి చుక్కలు చూపించింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. ఆ ఆకతాయిని చెప్పుతో చితక్కొట్టింది. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.