Pratidwani: కోహ్లీ-రోహిత్ మధ్య విబేధాలు నిజమేనా ? - ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2021, 10:11 PM IST

భారత క్రికెట్‌ జట్టులో ఏం జరుగుతోంది. టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ సారథ్యానికి టాటా అన్న కింగ్ కోహ్లీ నిర్ణయం మాములు వేడి రేపలేదు. కోహ్లీ రాజీనామా వెనక కారణాలు ఏమిటి ? కెప్టెన్‌ - వైస్ కెప్టెన్ మధ్య విబేధాలు నిజమేనా ? ఆడేది ఎవరు.. ఆడిస్తోంది ఎవరు ? రోహిత్, రాహుల్, పంత్‌ల్లో ఎవరికి ఛాన్స్ ? ఇంట - బయట ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించేవారు కొందరు..జీర్ణించుకోలేక పోతున్న వారు మరికొందరు. సాధారణ క్రికెట్ అభిమానుల్లో అయితే ఎవరికి తోచిన విశ్లేషణలు వారివి. జట్టులో అంతరాలు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయా ? జట్టు కూర్పులో రాజకీయాలు నడుస్తున్నాయా ? అని తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తున్న వారూ ఉన్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.