ప్రతిధ్వని: కరోనా వ్యాక్సినేషన్-అమెరికా అనుభవాలు - లేటెస్ట్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించింది అగ్ర రాజ్యం అమెరికా. వ్యాక్సిన్ల ప్రభావంతో రోజువారీ కేసులు తగ్గుతున్నాయని గణంకాలు, మాస్కులపై అమెరికా సీడీసీ ప్రకటనలే అందుకు కారణం. కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మకపోరులో అమెరికా ఎలా కొనసాగుతోంది. కేసుల కట్టడి, మాస్ వ్యాక్సినేషన్‌కు ఆ దేశం ఎలాంటి ప్రణాళికలు అనుసరిస్తోంది. భారత్ గమనించాల్సిన అనుకూల అంశాలేంటీ. ఎందుకంటే ఇదే వేగం, స్ఫూర్తి కొనసాగితే వచ్చే మూణ్నాలుగు నెలల్లో కరోనాపై పోరాటంలో అగ్ర రాజ్యం కీలక ఘట్టానికి చేరినట్లేనని అన్న అంచనాలు కొత్త ఆశలు రేకెతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా అమెరికాలో వైద్య నిపుణులుగా సేవలందిస్తూ ఈ పోరాట క్రమాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న ప్రవాసభారతీయ వైద్యులతో ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.