State Wide Bhogi Celebrations : సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలుగులీనుతున్నాయి. భోగభాగ్యాల సంక్రాంతిని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది.
CM Chandrababu Wishes To People : సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలతో సమస్యలన్నీ పోయి ప్రజలందరికీ భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మంత్రి లోకేశ్ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ భోగి మంటలు జీవితాల్లో సరికొత్త కాంతులు తీసుకురావాలి తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని… pic.twitter.com/2mEwSKe4c0
— N Chandrababu Naidu (@ncbn) January 13, 2025
తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలి. భోగిమంటల్లో… pic.twitter.com/UmZefK6s1h
— Lokesh Nara (@naralokesh) January 13, 2025
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు ద్వారంపూడి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో భారీ భోగిమంట ఏర్పాటు చేశారు. 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భోగి మంట కోసం భారీగా దుంగలు ఏర్పాటు చేశారు. అనపర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగిమంట వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఆనందోత్సవాలతో పండుగను జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు
నెల్లూరు జిల్లాలో భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. నగరంలో ప్రజలు వేకువజామునే భోగి మంటల వేశారు. నెల్లూరులో పలు డివిజన్లలో భోగి వేడుకల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. మూలాపేట మూలస్థానేశ్వర ఆలయం వద్ద కేకు కట్ చేసి భోగి మంటలు వెలిగించారు. ట్రంకురోడ్డు శివాజీ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరంగా మంటలు వేశారు. కార్యకర్తలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు.
సంక్రాంతి అంటేనే స్వీట్లు హాట్లు- ఘుమఘమలాడే వంటకాలతో కిటకిటలాడుతున్న మిఠాయి షాపులు
భోగి పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు వేశారు. వేకువ జామున ఆలయ మహాద్వారం ముందు అధికారులు,అర్చకులు భోగి మంట వేశారు. శ్రీవారి సేవకులు, భక్తులు గొబ్బీలు పెట్టారు. భోగి పూర్తైన తరువాత శ్రీవారికి ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు వెలిగించి సంబరాల్లో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అసలైన పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొని అభిమానులతో కలిసి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు నృత్యం చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నివాసం వద్ద ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఒంగోలులోని టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల వేకువ జాము నుంచే భోగి మంటలతో ప్రజలు సందడి చేశారు. గంగిరెద్దులు, హరిదాసులు ఆటపాటలతో అలరించారు.
ఊరూ వాడ సంక్రాంతి శోభ- సందడంతా చిన్నారులు, యువతదే