ETV Bharat / spiritual

"భోగి రోజున ఈ రాశుల వారికి బంధువులతో గొడవలు వస్తాయ్ - తప్పక ఈ పనులు చేయాలి" - DAILY HOROSCOPE IN TELUGU

- జనవరి​ 13వ తేదీన వివిధ రాశుల వారికి కీలక సూచనలు - జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్

January 13th 2025 Daily Horoscope
January 13th 2025 Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 10:37 AM IST

January 13th 2025 Daily Horoscope : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్సాహంగా భోగి పండగ జరుపుకుంటున్నారు. మరి, భోగి పండగ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఈ రోజున ఏం చేయాలి? అనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

మేషం (Aries) : మేష రాశి వారు ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే, శత్రుత్వ బాధలు ఎదురవుతాయి. కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని రకాల చిక్కులు ఎదురవుతాయి. కానీ, అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే పనులు కొంచెం ఆలస్యం అవుతుంటాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మనోవిచారంగా ఉంటారు. దానిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంతిమంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మిథునం (Gemini) : మిథున రాశి వారు ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. వాళ్ల ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. ఈ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారు ఈరోజు దేవుడి అనుగ్రహం, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం ఉంటుంది.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు వ్యాపార పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధనపరంగా ఇబ్బందులు కనిపిస్తాయి. కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనం కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా? - ఈ పద్ధతి పాటిస్తేనే విష్ణుమూర్తి అనుగ్రహం!

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కారణం లేకుండా గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి, వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు వాహన గండాలు తృటిలో తప్పిపోతాయి. కాబట్టి, డ్రైవింగ్​ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వెల్లుల్లి దగ్గర పెట్టుకోవడం, దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణాలు చేయడం మంచిది.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ప్రధానంగా అప్పుల బాధ తొలగిపోతుంది. ఏదో ఒక విధంగా డబ్బులన్నీ అడ్జస్ట్​ అయి రుణ బాధ తొలగిపోయే అవకాశం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అవసరమైతే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి శక్తిసామర్థ్యాలు లభిస్తాయి.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు కోర్టు సమస్యల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవాలి.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మనోవిచారం ఉంటుంది. అంతిమంగా దాన్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరంగా చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా పనులు ప్రారంభిస్తే చిక్కులు ఎదురవుతాయి. కానీ, వాటిని పరిష్కరించుకోగలుగుతారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"సంక్రాంతి రోజు ఇలా పూజ చేస్తే - ఏడాది మొత్తం సకల శుభాలు కలుగుతాయి!"

సంక్రాంతి రోజు ఈ దానాలు చేస్తే - సంవత్సరం మొత్తం ధనలాభమట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.