pratidhwani: పోలవరం నిర్వాసితుల గోడు వినేదెవరు..?
🎬 Watch Now: Feature Video
నిర్వాసితుల గోడు వినేదెవరు..? కష్టం తీర్చే నాథులెవరు..? ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్ట్ ప్రభావిత 275 గ్రామాల ప్రశ్న ఇది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికీ 9 గ్రామాల్లో 3,300 మందికే పరిహారం దక్కింది. వర్షాల ప్రభావం దృష్ట్యా.. ప్రస్తుతం 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని గ్రామాలు ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. ప్యాకేజీ, ప్రత్యమ్నాయ భూమిపై స్పష్టత లేదంటూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం నిర్వాసిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు ఏంటి..? ఎన్నికల వేళ ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేరకు నెరవేరాయి? పునరావాసం కోసం ప్రజలు ఎందుకు పోరాడాల్సి వస్తోంది? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ చేపడుతోంది.