Couple Missing in Krishna River: కార్తికమాసం కావడంతో ప్రజలంతా పుణ్య స్నానాలను ఆచరించడానికి వారికి సమీపంలో గల నదుల వద్దకు వెళుతూ ఉంటారు. అయితే ఒక్కొక్క సారి దురదృష్టవశాత్తు అనుకోకుండా కొద్దిమంది భక్తులు నీటిలో మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది. మరికొద్ది మంది నదిలో స్నానం చేస్తూ కనిపించకుండా అదృశ్యమైన సందర్భాలు సైతం ఉంటాయి. అటువంటప్పుడు వారు బతికే ఉన్నారా? లేక చనిపోయారా? అనే ఆందోళన అదృశ్యమైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు తీవ్రంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
WOMEN SUICIDE: ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య
భార్యను కాపాడబోయి భర్త అదృశ్యం: రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన భార్యాభర్తలు నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తిక స్నానమాచరించడానికి దగ్గర్లోని కృష్ణా నది సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. స్నానం చేస్తుండగా భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త సత్యనారాయణ సైతం ఈదుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో సత్యనారాయణ సైతం కనిపించకుండా అదృశ్యమయ్యారు. దాంతో దీన్ని గమనించిన స్థానికులు, జాలర్ల సహాయంతో నదిని అంతా వెతికి చూడగా భార్య పద్మావతి మృతదేహం బయటపడింది. కానీ పద్మావతి భర్త సత్యనారాయణ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
గజఈత గాళ్లతో కలిసి వారి కుటుంబ సభ్యులు సత్యనారాయణ గురించి ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ తెలియలేదు. మృతురాలు పద్మావతిని చూసిన ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నదిలో స్నానానికి వెళ్లకపోతే బాగుండేదని వారు తీవ్రంగా రోదిస్తున్నారు.