Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్‌యాదవ్‌ను 2 గంటలపాటు పోలీసులు విచారించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్‌కి ఇటీవల పోలీసులు నోటీసులు అందజేశారు.
ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఇప్పటికే అరెస్టు అయిన నలుగురి ఫోన్లను పోలీసులు విశ్లేషించారు. నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా జైపాల్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదు: తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో నోటీసులిచ్చారని జైపాల్‌యాదవ్ తెలిపారు. 2 కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్ నంబర్లు ఇచ్చానని, ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదని జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వివాదం పరిష్కారం కోసం అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశానని, తిరుపతన్న మా సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతోనే కలిసినట్లు చెప్పారు. పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారించారని అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్న జైపాల్‌యాదవ్, ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు.
"తిరుపతన్న ద్వారా ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో నోటీసులిచ్చారు. 2 కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్‌నంబర్లు ఇచ్చాను. రెండు ఫోన్‌నంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి తెలియదు. ఓ వివాదం పరిష్కారం కోసం అదనపు ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో కలిశాను. పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తాను". - జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే
'చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారు - ఫోన్ ట్యాపింగ్‌తో నాకేమీ సంబంధం లేదు'
'మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరిగింది?' - మరో నలుగురు మాజీలకు నోటీసులు!