ETV Bharat / state

బైక్​ చక్రంలో చిక్కిన చీరకొంగు - కిందపడి మహిళ మృతి - SAREE GETS STUCK IN BIKE WHEEL

కుమారుడి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక చక్రంలో ఇరుక్కొన్న చీరకొంగు - అక్కడికక్కడే తల్లి దుర్మరణం

A Woman Died Saree Gets Stuck In Bike Wheel In Palnadu District
A Woman Died Saree Gets Stuck In Bike Wheel In Palnadu District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 3:33 PM IST

A Woman Died Saree Gets Stuck In Bike Wheel In Palnadu District : తన కుమారుడిని చూసేందుకు వచ్చింది ఆ తల్లి. కుమారుడిని చూసి సంతోషంతో మురిసిపోయింది. కుమారుడితో రెండు రోజులు ఉండి బాగోగులు తెలుసుకుంది. త్వరగా డ్యూటీకి వెళ్లాలి లేటవుతుందంటూ బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై కూర్చొని బయలుదేరింది. అదే ఆమె చివరి రోజైంది. దారి మధ్యలో ఆమె చీరకొంగు బైక్‌ వెనుక చక్రంలో ఇరుక్కుంది. ప్రమాదానికి గురై క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.

పల్నాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాసరి శ్రీకాంత్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పని చేసే వారు. ఆయన దురదృష్టవశాత్తు 2009వ సంవత్సరంలో గుండె నొప్పితో మృతి చెందారు. అనంతరం కారుణ్య నియామకం కింద ఆయన భార్య దాసరి సుస్మిత (49)కు ప్రభుత్వం జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగం కల్పించింది. ఆమె పల్నాడు జిల్లా మాచర్లలోని కాసు బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసేవారు. అక్కడే గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

పంట పొలంలో దంపతులు మృతి - హత్యా లేక ఆత్మహత్యా?

తన కుమారుడు ధనుష్‌ వాత్సవ్‌ను చూసేందుకు రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలోని నల్లపాడుకు వెళ్లారు దాసరి సుస్మిత. కుమారుడిని చూసిన అనంతరం గురువారం (నవంబర్ 14) తన విధులకు హాజరవ్వాలని బయలుదేరారు. బస్సు ఎక్కేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై నల్లపాడు నుంచి పేరేచర్ల చౌరస్తాకు వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఆమె చీర కొంగు వాహనం వెనక చక్రంలో ఇరుక్కుంది.

దీంతో ఒక్కసారిగా సుస్మిత కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మేడికొండూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు చేసేటప్పుడు చీర కొంగు, చున్నీల వంటివి చేతితో జాగ్రత్తగా పట్టుకోవాలని పోలీసులు సూచించారు. లేదంటే ప్రమాదాలు సంభవించి జీవితాలు తలకిందులవుతాయని తెలిపారు.

పన్నెండేళ్లకు పుత్ర సంతానం - వీధి కుక్కలు రాసిన మరణ శాసనం

గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి - అంతకు ముందు ఏం జరిగిందంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.