ప్రతిధ్వని: కొనసాగుతున్న కరోనా కల్లోలం.. ఆగని మృత్యుఘోష! - భారత్లో కరోనా ప్రభావం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11724146-196-11724146-1620742928053.jpg)
కన్నీళ్లు ఇంకిపోతున్న శోకం.. తల్లులు - బిడ్డలూ కడసారి చూపులకు నోచుకోలేని దైన్యం.. కరోనా ప్రమాదాన్ని అంచనా వేయడంలో అజాగ్రత్తగా వ్యవహరించిన పాలనా వ్యవస్థల వైఫల్యానికి ప్రతిఫలం. ఆగమేఘాల మీద విమానాలతో ఆక్సీజన్ కంటెయినర్లు దిగుమతి చేస్తున్నా.. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. లక్షల డోసుల టీకాలు పంపిణీ చేస్తున్నా... కోవిడ్ పడగ విస్తరిస్తూనే ఉంది. కోవిడ్ ఊహించని ఉత్పాతమే అయినా.. ఆపత్కాలంలో ఆదుకోలేనంత అధ్వాన్నంగా.. వైద్య, ఆరోగ్యవ్యవస్థ ఎందుకు తయారైంది? ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ఆసుపత్రుల్లో సైతం నమ్మకమైన వైద్యం ఎందుకు అందడంలేదు? ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.