నిన్నటివరకూ మిలమిల... ఇప్పుడంతా వెల వెల
🎬 Watch Now: Feature Video
నిన్నటి వరకు పెళ్లింటిలా హంగు ఆర్బాటాలతో... వచ్చే పోయే కార్యకర్తలతో సందడిగా ఉన్న పార్టీ కార్యాలయాలు వెలవెల బోతున్నాయి. ఎన్నికల పర్వం ముగియడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గుంటూరు నగరంలో పార్టీ కార్యాలయాలు నిన్నటి వరకు పండుగ వాతావరణాన్ని పోలి ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అనేక కసరత్తులు చేసిన అభ్యర్థులు... ఈ రోజు సేద తీరుతున్నారు .