Finance Minister Payyavula Keshav Response Budget : ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో గత 5 ఏళ్లు అనుభవంలోకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకేశవ్ విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్టును ప్రవేశపెట్టలేనంతగా గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో దేశంలోని ఆర్థిక అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్సుగా మారిందని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు. దిల్లీలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసే స్థితికి దిగజార్చారని ఆయన విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో శరవేగంగా అభివృద్ధి బాటలో సాగుతున్న రాష్ట్రం 2019 ఎన్నికల అనంతరం పాలకులు తీసుకున్న నిర్ణయాలతో పతనం వైపునకు పయనంగా మారిందని శాసనసభలో బడ్డెట్‌పై చర్చకు సమాధానంగా మంత్రి పయ్యావులకేశవ్ ఈ వ్యాఖ్యాలు చేశారు.
శాసనసభలో వార్షిక బడ్జెట్ పై ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. 2014-19 మధ్య కాలంలో 13.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019-24 మధ్య 10.5 శాతానికి పడిపోయిందన్న మంత్రి, ఈ తగ్గుదల ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద పడిందని ఆరోపించారు. 2014-19 కాలం నాటి అభివృద్ధి అలాగే కొనసాగి ఉంటే దాదాపు రూ.76,195 కోట్లు అదనంగా ఆధాయం లభించి ఉండేదని తెలిపారు. అభివృద్ధి పెంచడం ద్వారా సంపదను సృష్టించి పేదలకు పంచడం ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని విస్మరించారని దుయ్యబట్టారు. సంపదను పెంచుకోలేక అప్పుల మీద అతిగా ఆధారపడ్డారని ఆరోపించారు.
'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'
2019-24 మధ్య కాలంలో చేసిన అప్పులో కేవలం 22 శాతం మాత్రమే మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టారని మంత్రి విమర్శించారు. అంటే వంద రూపాయాల్లో 80 రూపాయలు తిని మిగిలింది ఖర్చు చేసినటువంటి పరిస్థితి అని వివరించారు. తెచ్చిన అప్పుతో ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని అన్నారు. రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు తెస్తే రూ.44 వేల కోట్ల సంపదను రైతులకు అందించామని, దీని ద్వారా రైతులకు, రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం పెరిగిందిన్నారు. ఇలా సంపదను పెంచితే ఎన్ని పథకాలైనా పేదలకు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
తెచ్చిన అప్పులను రెవెన్యూ ఖర్చుల కోసం వినియోగిస్తే రాష్ట్రం అప్పుల విష వలయంలో చిక్కుకుంటుందని మంత్రి పయ్యావుల అన్నారు. అప్పులకు వడ్డీలు తీర్చడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి కూడా కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అప్పుల విష వలయంలో చిక్కుకుని తిరిగి కట్టడానికి అప్పులు పుట్టని పరిస్థితి అన్న మంత్రి, దీన్ని అధిగమించడానికి అప్పులు కోసం తప్పులు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన విధానాలను చూసి కేంద్ర ఆర్థిక శాఖ విస్తుపోయిందన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాలన్నది ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వ పరిమితికి లోబడి FRBM లిమిట్సులో అప్పులు చేయాలి, కానీ ఆ లిమిట్స్ దాటి అప్పులు చేయడంతో అప్పులు పుట్టని పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
దీన్ని అధిగమించడానికి మధ్య ఆదాయాన్ని రెండు కార్పోరేషన్లకు మళ్లించారన్నారు.
మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే!
APSDC కార్పోరేషన్ మీద మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ.14,275 కోట్లు అప్పు తెచ్చారని, APSBCL మీద బాండ్లు రెయిజ్ చేసి అప్పులు తెచ్చి దారి మళ్లించారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు. అప్పుల కోసమే AP STATE FINANCIAL SERVICES పేరిట కార్పోరేషన్ పెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్ హెల్త్, స్త్రీ నిధి కార్పోరేషన్, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ ఇలా రూ.4738 కోట్ల రూపయలను ఆయా సంస్థల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించి, ఆ డబ్బును దారి మళ్లించి ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ డిపాజిట్లకు వడ్డీ చెల్లించడానికి ఆ కార్పోరేషన్‌లో ఒక్క రూపాయి కూడా లేదని అన్నారు. బోర్డు తిప్పేసే ఫైనాన్స్ సంస్థలకు ఈ కార్పోరేషనుకు ఉన్న తేడా ఏంటో స్టేట్మెంట్లు ఇస్తున్న పెద్ద మనుషులే చెప్పాలని మండిపడ్డారు. ఈ అప్పులన్నీ ప్రభుత్వ ఆస్తులు. అంటే ఎమ్మార్వో ఆఫీసులు, రైతు బజార్లు, సర్క్యూట్ హౌసులు ఇలా తాకట్టు పెట్టి మరీ తెచ్చారని విమర్శించారు.
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. రూ.5,308 కోట్లను అభయహస్తం పేరుతో రోజుకు ఒక్క రూపాయి చొప్పున డ్వాక్రా మహిళలు ఎల్ఐసీ వద్ద దాచుకున్న నిధిని వాడేశారన్నారు. 31-03-2019 నాటికి అప్పు రూ.3,75,295 కోట్లు కాగా 12-06-2024 నాటికి అప్పు రూ.9,74,556 కోట్లు ఉందని అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ లయబెలిటిస్ కింద రూ.80,914 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడబెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ నిధులు రూ.16,771 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎస్ కాంట్రిబ్యూషన్ కింద రూ.1307 కోట్లు, డిపాడజిట్ ఆఫ్ లోకల్ ఫండ్స్ కింద రూ.11,708 కోట్ల రూపాయల నిధులను కూడా మళ్లించారని మండిపడ్డారు. పుస్తకాల ప్రకారం ఈ నిధులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కానీ వాస్తవంగా లేవు. అంటే వాడబడ్డాయని అన్నారు.
గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు
విద్యుత్ ఉద్యోగుల సేవింగ్స్ దాదాపు రూ.5,243 కోట్ల రూపాయలు దారి మళ్లాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సీసీఎస్ స్కీంలు కేంద్ర పథకాల నిధులనూ మళ్లించేసిందని మండిపడ్డారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 93 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి దాదాపు రూ.6078.16 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ రోజుకు దాదాపు రూ.6306.28 కోట్ల రూపాయల నిధులను చెల్లించి 73 కేంద్ర పథకాలను పునరుద్దరించామని వివరించారు. 60:40 భాగస్వామ్యంలో వచ్చిన 60 శాతం నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రూ.12,367 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించామని మంత్రి పయ్యావుల కేశవ్ వివరిచారు.
లెక్కలేనితనంతో గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని దోపిడి అనాలో? ఆర్థిక అరాచకం అనాలో? ఆర్థిక విధ్యంసం అనాలో? తెలియట్లేదని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగిందని, దేనికీ సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవని అన్నారు. అంకెల గారడీతోనే గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. కేంద్ర సంస్థలను తప్పు దారి పట్టించిందన్నారు. ప్రభుత్వంలో ఉండగా అంకెల గారడీ చేసిన వాళ్లు విపక్షంలోకి వెళ్లాక కూడా అదే స్థాయిలో అంకెల గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుoడటం బాధాకరమన్నారు. ఆ తప్పిదాలే మనకు తిప్పలు తెచ్చి పెడుతున్నాయన్నారు.
వైఎస్సార్సీపీ భూఅక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం: మంత్రి అనగాని
కాంట్రాక్టర్లతోపాటు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు జరిపే చెల్లింపులనూ పెండింగులో పెట్టేశారని మంత్రి ఆరోపించారు. పిడుగుపాటుకు గురై చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియాను కూడా పెండింగులో పెట్టారని, వాటన్నింటినీ చెల్లిస్తున్నామన్నారు. పిల్లలకిచ్చే చిక్కీలు, చెత్త ఏరి పరిసరాల శుభ్రం చేసే కార్మికుల జీతాలను పెండింగులో పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి చెల్లింపులు కూడా పెండింగులో పెట్టి తాడేపల్లి ప్యాలెసులో ఉన్న ఖాజానాకు మాత్రం డబ్బులను యధేచ్ఛగా తరలించుకున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం పెండింగులో బిల్లులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటే, అనేక సంస్థలను బ్యాంకులు వేలం వేశాయని ఆరోపించారు. ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిలు పెట్టి లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద చిక్కుకునేలా వారి జీవితాలను నాశనం చేసిందన్నారు. ఆ సర్టిఫికెట్లను విద్యా శాఖ మంత్రి లోకేశ్ విడిపించి విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ప్రధాని మోదీ సహకారంతో గ్రామాలను పునరుజ్జీవింప చేసేందుకు నరేగా నిధుల ద్వారా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి కొంత మందికి కనబడడం లేదని మంత్రి పయ్యావుల విమర్శించారు. గత ప్రభుత్వం డ్యాములకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిందో నాటి సీఎం సొంత జిల్లాలోనే కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం శిధిలాల వద్దకు వెళ్లి అడిగితే తెలుస్తుందని అన్నారు. ఇష్టారీతిన పోలవరం ప్రాజెక్టు పనులను ఆపి డయాఫ్రం వాల్ విధ్వంసానికి కారణమయ్యారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కనీస నిర్వహణకు నోచుకోని రోడ్లను అడిగితే గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెబుతాయని అన్నారు. ప్యాలెస్సులో కూర్చొని బటన్ బటన్ నొక్కితే డబ్బులు తాడేపల్లి ఖాజనాకు పోయాయి కానీ లబ్దిదారులకు చేరలేదని అన్నారు. సూట్ కేసు కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలు, క్విడ్ ప్రో కో వంటి పదాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసిందే గత పాలకులు కాదా అని నిలదీశారు.
"పెద్దల సభ అని గుర్తుంచుకోండి - 'సోషల్ సైకో'లకు ఎలా మద్దతిస్తారు?"
అసెంబ్లీకి రాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ప్యాలెస్సులో కూర్చొని మాట్లాడుతున్నారన్నారని మంత్రి మండిపడ్డారు. బాబాయ్ హత్య విషయంలో ఆడిన డ్రామాలు, సోషల్ మీడియాలో తిట్టించిన బండ బూతులు, కోడికత్తి డ్రామా, గులక రాయి డ్రామాలు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడం, గత పాలకులు చేసిన శాండ్ మాఫియా, మద్యం మాఫియా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు. బడ్జెట్ అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రజా ప్రాధాన్యతలకు ముందుగానే ప్రజలకు చెప్పే డాక్యుమెంట్ అని తెలిపారు. కాగ్ నివేదికలు కూడా తప్పులు ఎత్తి చూపేలా బడ్జెట్టులో దొంగ లెక్కలు వేయించి, నిబంధనలను ఉల్లంఘించిన ఘనత గత ప్రభుత్వానిదని విమర్శించారు.
గత ప్రభుత్వ బడ్జెట్టులో చేసిన అప్పులు చూపకుండా తిరిగి చెల్లింపులను మాత్రం గత బడ్జెట్టులో చూపిన ఉల్లంఘనలు ఏమని చెప్పాలని ప్రశ్నించారు. జగన్ ఉండడానికి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్సుకు తీసుకున్న అప్పుల చెల్లింపులు ప్రజలు కట్టాలా? అని మండిపడ్డారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ.634 కోట్లను గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు కాగ్ చెప్పిందని అన్నారు. ఈ అనుమతి లేని ఖర్చులు ఎవరి కోసం చేశారు?, ఎందుకోసం చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీ అనే గౌరవం లేకుండా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని దోచుకోవడానికే అన్నట్టు ప్రవర్తించినందుకే ప్రజలు తిరుగులేని తీర్పుతో బుద్ధి చెప్పారన్నారు.
ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా బడ్జెట్ - ఎమ్మెల్యేల ప్రశంసలు
అమరావతి విధ్వంసం విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా? అని నిలదీశారు. సొంత సాక్షి మీడియాకు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచిపెట్టడం, సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ జీతాలివ్వడం ఆర్థిక దోపిడి కాదా? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సామ్రాట్ అరాచక మహరాజ్, విధ్వంస వీరుడు అని బిరుదులిచ్చి జగన్ కు అవార్డులివ్వాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమం కోసం పేదలకు మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
తొలిసారి బడ్జెట్ పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ నినాదమన్నారు. ఈ స్ఫూర్తితో బడ్జెట్ కసరత్తు చేశామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమపాళ్లల్లో ఉండేలా బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
జగన్ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత