ఉద్రిక్తంగా.. భాజపా - జనసేన ధర్మయాత్ర - విజయనగరం జిల్లా రామతీర్థం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10123885-963-10123885-1609829422901.jpg)
భాజపా - జనసేన నాయకులు తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రను.. పోలీసులు భగ్నం చేశారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా.. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లేందుకు సిద్ధమైన భాజపా శ్రేణులను పోలీసులు.. ఎక్కడికక్కడ నిర్బంధించారు. రామతీర్థం జంక్షన్ వరకూ వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకుని... నెల్లిమర్ల పోలీస్టేషన్‌కు తరలించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెదేపా, వైకాపా నేతలను కొండపైకి అనుమతించిన ప్రభుత్వం.. తమను ఎందుకు అడ్డుకుంటోందో సీఎం సమాధానం చెప్పాలని.. భాజపా నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు.. జనసేన నేతలను సైతం పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.