Minister Lokesh on Vamsi Arrest: ఎస్సీ యువకుడుని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లాడని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఇంక చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలో రెడ్‌బుక్ చూపించి చెప్పానని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకుల్ని గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టినవారిపట్ల రెడ్‌బుక్ అమలవుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు.
2019-24 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి హైదరాబాద్ వెళ్లిన ఏపీ పోలీసులు - వంశీ ఇంట్లో సోదాలు
దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: వంశీకి మద్దతుగా జగన్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హోంమంత్రి అనిత అన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనే న్యాయవిచారణ జరుగుతుందని వివరించారు. సత్యవర్థన్ సోదరుడి ఫిర్యాదుతోనే పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని తెలిపారు. కానీ వైఎస్సార్సీపీ నేతలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వంశీకి మద్దతుగా జగన్ మాట్లాడుతున్నారని కాని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై అన్యాయంగా దాడులు చేశారని అప్పుడు ఎందుకు మాట్లాడలేదని మంత్రి అనిత ప్రశ్నించారు.
వంశీని వెనకేసుకు రావడం సిగ్గుచేటు: దళిత యువకుడపై దాడి, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. వంశీ లాంటి వారు సమాజంలో తిరిగితే ప్రజలకు హానికరమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా వంశీని వెనకేసుకొస్తూ ట్వీట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. వంశీ లాంటి వారిని ప్రోత్సహించినందుకు ప్రజలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు.
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా వంశీ - అక్రమాల్లో 'సిక్స'ర్ గ్యాంగ్ తోడు