ప్రతిధ్వని: గురుదేవోభవ - ఉపాధ్యాయ దినోత్సవం
🎬 Watch Now: Feature Video
"మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ" అంటారు. మన దేశంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకు మాత్రమే ఉంది. విద్యార్థుల భవిష్యత్తునే కాదు.. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే గురువులకు సమాజం అత్యంత విలువైన స్థానం ఇచ్చి గౌరవిస్తోంది. అలాంటి గురువు పాత్ర కూడా నేడు అనేక విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. జాతీయ నూతన విద్యా విధానం.. విద్యార్థి సమగ్ర మనో వికాసానికి పెద్ద పీట వేస్తూ.. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాల పైన కూడా అధిక దృష్టిని కేంద్రీకరించింది. సెప్టెంబర్ 5.. గురు పూజోత్సవం సందర్భంగా.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమైంది? అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.