YSRCP Spreading Fake News Against Chandrababu: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా వైసీపీ.. ఫేక్​ ఫోన్​ కాల్​పై టీడీపీ నేతల ఆగ్రహం.. - వైసీపీపై టీడీపీ నేతల ఆరోపణలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 1:16 PM IST

YSRCP Spreading Fake News Against Chandrababu: చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా వైసీపీ తెగబడుతోందని.. ఆ మేరకే దుష్ప్రచారలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. వైసీపీ చంద్రబాబుపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. కల్పిత ఫోన్​ సంభాషణలను సృష్టించి.. ప్రజలలోకి వదిలిపెడ్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందంటూ ఇద్దరు యువతీ, యువకులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఆ రికార్డులను.. వైసీపీ నేతలు ప్రజలకు ఫోన్ల ద్వారా వినిపిస్తున్నారని టీడీపీ నాయకులు అన్నారు. ఇద్దరి మధ్య సాగిన ఆ సంభాషణలు సాధారణ సంభాషణలు కావని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 2017లోనే స్కిల్​ కేసు ప్రాజెక్టు అక్రమాలు జరిగియాని.. ఆ యువతి యువకులు మాట్లాడుకున్నారని దానినే ఫోన్​ కాల్ రూపంలో వినిపిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులే ఆ స్క్రిప్ట్​ తాయరు చేశారని ఆరోపించారు. అందుకు అనుగుణంగానే వారి పేటీఎం బ్యాచ్​తో మాట్లాడించి రికార్డ్​ చేశారని.. దానిని ఇప్పుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.