ఎన్నికల 'టైం' దగ్గరపడిందని తాయిలాలకు తెరతీసిన అభ్యర్థులు - అప్పుడు తండ్రి, ఇప్పుడు కుమారుడు - AP News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 9:44 AM IST

YSRCP Leaders Started Election Temptations : సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ప్రలోభాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chandragiri Mla Chevi Reddy Bhaskar Reddy) గోడ గడియారాలను పంపిణీ చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సైతం ఇదే తరహాలో గోడ గడియారాలను పంపిణీ చేయగా వాటిపై భాస్కర్ రెడ్డి ఫొటో ఉంది. గురువారం భాస్కర్ రెడ్డి జన్మదినం కావడం.. గడియారాలపై ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చిత్రం ఉండటంతో ఎన్నికల తాయిలంగానే పంపిణీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అభియోగాలకు బలం చేకూర్చేలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని గడియారంపై ముద్రించారు. ఇలా మొత్తం 1.15 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

Chandragiri Mla Chevireddy Bhaskar Reddy Distributed Wall Clocks : ఇప్పటికే పలు మండలాల్లో పంపిణీకి ఆయా గ్రామాల్లోని వైసీపీ శ్రేణులకు చేరవేశారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు వాలంటీర్లతో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని విపక్ష నేతలు తెలిపారు. గడియారాలు వద్దు.. ఉద్యోగాలు కావాలంటూ చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుయువత కార్యకర్తలు నిరసన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.