YSRCP Activists Dissent on Minister Vishwaroop: మంత్రి విశ్వరూప్‌పై అసమ్మతి.. కష్టపడిన వారికి ప్రాధాన్యం లేదని ఆరోపణ
🎬 Watch Now: Feature Video
YSRCP Activists Dissent on Minister Vishwaroop: కోనసీమ జిల్లా వైసీపీలో అసమ్మతి రాజుకుంది. వాలంటీర్లకు ఇచ్చే ప్రాధాన్యంలో కొంతైనా తమకు ఇవ్వటం లేదంటూ ఇప్పటికే ఓ వర్గం వాపోతోంది. మంత్రి విశ్వరూప్‌కు వ్యతిరేకంగా అల్లవరం వైసీపీ ఎంపీటీసీ, మండల స్థాయి నాయకులు సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చుచేస్తే.. కనీస గౌరవం ఇవ్వట్లేదంటూ అసంతృప్తి గళాన్ని వినిపించారు. నిద్రహారాలు లేకుండా పార్టీ కోసం కష్టపడితే.. పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మూకుమ్మడి రాజీనామాలకు వెనకాడబోమని హెచ్చరించారు. డబ్బులు ఇవ్వకపోతే ఒక్కరు కూడా ప్రభుత్వ కార్యాక్రమాలకు వచ్చే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కష్టపడిన వారిని పక్కన పెట్టి.. మధ్యలో వస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని వాపోయారు. మండలంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియనివ్వటం లేదని అన్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ముఖ్యమంత్రి సమావేశానికి.. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పాసులు జారీ చేయటాన్ని ప్రశ్నించారు.