వైసీపీలో వర్గపోరు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా అవహేళనలు - కస్తూరి రెడ్డిపై మధుసూధన్ విమర్శలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 1:46 PM IST
YCP Vargaporu in Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూధన్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారని కనిగిరి వైసీపీ జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేస్తున్నాని, ఏనాడు పార్టీకి మచ్చ తెచ్చేలా వ్యవహరించలేదని అన్నారు. రాజకీయ కక్షతో సొంతపార్టీ నేతలు చెప్పిన తప్పుడు మాటలు విని బుర్ర మధుసూధన్ తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కస్తూరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kasthuri Reddy Comments on Own Party : తాను టీడీపీతో కుమ్మక్కై సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారన్న మధుసూధన్ వాఖ్యలను కస్తూరి రెడ్డి తీవ్రంగా ఖండించారు. చెప్పుడు మాటలు విని తన పట్ల వ్యవహరించే తీరు సరైనది కాదని మండిపడ్డారు. ఎలాంటి రుజువులు లేకుండా నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. దమ్ముంటే తాను టీడీపీకి కొమ్ముకాస్తున్నట్లు సాక్షాలు చూపించమని సవాలు విసిరారు.