ప్రజలు లేక వెలవెలబోయిన సామాజిక సాధికార యాత్ర! మంత్రులు మాట్లాడుతుండగానే వెనుతిరిగిన మహిళలు - సామాజిక సాధికార యాత్ర రూట్ మ్యాప్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 9:21 PM IST
YCP Samajika Sadhikara Bus Yatra: వైసీపీ ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం బెడిసికొడుతుంది. ప్రజల నుంచి మద్దతు అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా... ప్రభుత్వం సామాజి సాధికార బస్సు యాత్ర అంటూ, ప్రజల్లోకి వెళ్తున్న నెపథ్యంలో... ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మంత్రులు నోర్లు వెల్లబెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా... గుంటూరులో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు ముస్తఫా, హఫీజ్ ఖాన్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రారంభం నుంచే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మంత్రులు మాట్లాడుతుండగానే మహిళలు స్థానికులు తిరుగుముఖం పట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు సైతం ప్రజా స్పందన కరువైంది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, మంత్రి గుమ్మనూరు జయరాం, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతుండగానే... ప్రజలు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో సభ ఆవరణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమం కోసం మహిళా సంఘాల సభ్యులను తరలించారు. ప్రజలు వెళ్లిపోయినప్పటికీ... ప్రజా ప్రతినిధులు మాత్రం తమ ప్రసంగాలను కొనసాగించారు.