వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరసన - సబ్ రిజిస్ట్రార్‌ను తొలగించాలని డిమాండ్ - YCP MLA Rachamallu Sivaprasad Reddy comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 6:54 PM IST
YCP MLA Rachamallu Sivaprasad Reddy Protest at Sub Registrar Office: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరసనకు దిగారు. సబ్ రిజిస్ట్రారు సమయానికి కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రారు మహ్మద్ రఫీని విధుల నుంచి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని డీఐజీకి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
MLA Rachamallu Sivaprasad Reddy Comments: ''వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్ సమయానికి రావటం లేదు. ప్రతి రోజు 9 గంటలకు రావాల్సిన రిజిస్ట్రార్ 1 గంటకు వస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇన్‌ఛార్జి, సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ రఫీ విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారు. అందుకే కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి నేను కూడా నిరసన చేపట్టాను. మహ్మద్ రఫీని విధుల నుంచి తొలగించాలని, అతనిపై (మహ్మద్ రఫీ) చర్యలు తీసుకోవాలని నేను డీఐజీకి ఫిర్యాదు చేశాను.'' అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.