FLORICULTURE IN ELURU: మార్కెట్లో పూలకు మంచి గిరాకీ ఉందని గుర్తించిన రైతులు నష్టాల నుంచి గట్టెక్కేందుకు బంతి, చామంతిని సాగు చేస్తున్నారు. అయితే కొన్నాళ్లు మంచి లాభాలే గడించినా ఈ ఏడాది మాత్రం విరుల సిరులు కురిపించడం లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఓ వైపు తెగుళ్లు మరోవైపు చిమ్మేసి ఏలూరు జిల్లా రైతుల ఆశలపై నీళ్లు చళ్లాయి. రంగుల రంగులతో ఆహ్లాదకరంగా కనువిందు చేయాల్సిన పూలు వాడిపోయి, మాడిపోయి అంధవికారంగా మారాయి. పూలకు ఏ వైరస్ సోకిందో అంతు చిక్కక రైతులు తలలు పట్టుకుంటున్నారు.
కలసిరాని పూలసాగు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, లాభాలు సాధించే అవకాశముండటంతో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో రైతులు విస్తారంగా పూలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి బంతి, చామంతి వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మార్కెట్లకు పూలు సరఫరా చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గతేడాది వరకూ వ్యాపారం సాఫీగానే ఉన్నా ఈ ఏడాది మాత్రం పూల సాగు ఆశాజనకంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, అధిక వర్షాలు కురవడంతో ఆ ప్రభావం పూలసాగుపై పడింది.
ఒకే రోజులో మూడు రంగులు- ఊసరవెల్లి మాత్రం కాదు
తెగుళ్ల నివారణకు అధికారులకు వినతి: దీనికితోడు తెగుళ్ల బెడద రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు మూడు చెట్లే కదా మాడిపోయాయని వదిలేస్తే మిగతా వాటికి వ్యాపించి పంట మొత్తం పాడైపోయి దిగుబడి బాగా పడిపోయింది. పండుగలు దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో పూలకు ధర పలకకపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కడియం నర్సరీ నుంచి వీరు నారు తెచ్చుకుని పూల తోటలు సాగు చేస్తుంటారు. నారుదశలో బాగానే ఉన్నా మొగ్గ దశకు వచ్చేసరికి ఏ తెగులు సోకుతుందో తెలియడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైరస్ కారణంగా మొక్కలు మాడిపోవడంతో చేసేదేమీ లేక వాటిని దున్నేసి ఇతర పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఉద్యానశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి పూల సాగులో తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చి నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చూపాలని రైతులు కోరుతున్నారు.
"కడియం నర్సరీ నుంచి నారు తెచ్చుకుని పూల తోటలు సాగు చేశాం. నారుదశలో బాగానే ఉన్నా మొగ్గ దశకు వచ్చేసరికి ఏ తెగులు సోకుతుందో తెలియడం లేదు. వైరస్ కారణంగా మొక్కలు మాడిపోవడంతో చేసేదేమీ లేక వాటిని కోసి దున్నేస్తున్నాం. దీనికి బదులుగా ఇతర పంటలు వేసేందుకు మేమంతా సిద్ధమవుతున్నాం ఉద్యానశాఖ అధికారులు దృష్టి సారించి పూల సాగులో తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చి నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చూపాలని కోరుతున్నాం"-ప్రసాద్, ఉప్పలపాడులక్ష్మీకాంతం, నారాయణపురపురం
అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time
ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా? వాస్తు నిపుణులు సమాధానమిదే! - Oleander Flower At Home