YCP Leaders Vs SEB Officials in Sri Sathya Sai District: అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్​ను అడ్డుకున్న సెబ్ అధికారులు.. వైసీపీ నాయకుల వాగ్వాదం - YCP leaders sand transport in Sathyasai district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 1:49 PM IST

YCP Leaders Stopped SEB Officials: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాన్ని జప్తు చేయడానికి వెళ్లిన సెబ్​ (SEB) అధికారులను వైసీపీ నాయకులు అడ్డుకొని అధికారుల విధులకు అడ్డుపడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం జయ మంగలి నది నుంచి ట్రాక్టర్ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో హిందూపురం సెబ్​ అధికారులు మాటు వేశారు. నది నుంచి ఇసుకతో వస్తున్న వాహనాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తరలించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.. తమ వద్ద అనుమతి పత్రం ఉందంటూ ఫోర్జరీ సంతకాలతో ఉన్న పేపర్లను చూపించారు. అధికారులు ఒప్పుకోకపోవడంతో ట్రాక్టర్​ని స్టేషన్​కు తరలిస్తామని నమ్మబలికి.. ఇసుకను మరోచోట తరలించి ఖాళీ వాహనాన్ని స్టేషన్​కు తరలించారు. వైసీపీ నాయకులు రోడ్డుపై అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనను అక్కడి స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మధ్యమాలలో ప్రచారం చేశారు. తమ విధులకు భంగం కలిగేలా వైసీపీ నాయకులు వ్యవహరించారని సెబ్​ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.