నడివీధిలో దళితుడిపై వైసీపీ నేతల దాడి - ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు - వైఎస్సార్సీపీ నాయకుల దాడి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20456645-thumbnail-16x9-ycp-leaders-attack-dalit-farmer.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 1:30 PM IST
YCP leaders attack Dalit farmer : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో నడి వీధిలో దళితుడైన రామాంజనేయులుపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రైతు రామాంజనేయులు వైసీపీ నాయకులపై ఉరవకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉరవకొండ పోలీసు స్టేషన్ ఎదుట రామాంజనేయులు దంపతులు బైఠాయించారు. పొలం విషయంలో దళితుడిని వైసీపీ నాయకులు జెండాలతో వచ్చి కొట్టారని పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ దాడిపై ఎస్పీ కు ఫిర్యాదు చేయనున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ సామాజిక బస్సు యాత్ర నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎంపీపీ కొడుకు, ఆయన అనుచరులు నన్ను నడివీధిలో కిందపడేసి కొట్టినారు. నా ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? చేను నాది కాదని, వాళ్లదని బెదిరించారు. నా తల పగలగొట్టి రక్తం కారుతున్నా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. ఇదెక్కడి న్యాయం?
- రామాంజనేయులు, బాధితుడు