60ఏళ్ల నాటి భారీ వృక్షాల తొలగింపు - పర్యావరణ ప్రేమికుల ఆందోళన - andhra pradesh trees news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 5:04 PM IST
YCP Government Not Response Cutting Trees : వైసీపీ పాలనలో పర్యావరణ పరిరక్షణకు కనీస ప్రాధాన్యం లేకుండా పోతోంది. దశాబ్దాల నాటి భారీ వృక్షాలను అడ్డగోలుగా నరికి పారేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల వద్ద సాగర్ కుడికాలువ తవ్వినప్పుడు నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా మారి ఆ ప్రాంతమంతా చిన్నపాటి వనాన్ని తలపించేలా ఉండేదన్నారు. వాటితో పాటు జలవనరుల శాఖ కార్యాలయ పరిధిలోని స్థలంలోనూ ఆరు దశాబ్దాల నాటి అరుదైన చెట్లు ఉండేవని జీడీసీసీ గోదాం నిర్మాణం కోసమంటూ ఆ చెట్లన్నింటినీ తొలగించారని వాపోయారు.
పర్యావరణ ప్రేమికులు ఏడాది మొదట్లోనే ఈ ఆలోచన తెలిసి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఫిబ్రవరిలో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావును కలసి అరుదైన భారీ వృక్షాలు నేలకూల్చవద్దని ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వో(Divisional Forest Officer) ఆదేశాలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది సామాజిక వనంలా ఉన్న అరుదైన చెట్లను తొలగించవద్దని సిఫార్సు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా రెండు రోజులుగా భారీ వృక్షాలను నేలకూల్చారు. గత ప్రభుత్వ హయాంలో చెట్టు కొమ్మలు నరికితే చాగంటివారిపాలేనికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం నేతలతో గొడవ పడ్డారు. కానీ ఇప్పుడు భారీ వృక్షాలను నరుకుతున్నా మౌనం పాటించడంపై విమర్శలు వస్తున్నాయి.