ఇసుక గోల్మాల్పై అధికారుల సమీక్ష - ఆత్మహత్యకు యత్నించిన వర్క్ ఇన్‌స్పెక్టర్ - Argument between officials in Rayachoti
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 7:50 PM IST
Work Inspector Suicide Attempt in Sand Dispute : ఇసుక వివాదంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రాయచోటి జగనన్న కాలనీకి గృహ నిర్మాణ శాఖ ఇసుకను సరఫరా చేస్తుంది. ఈ ఇసుకను అధికారులే పక్కదారి పట్టించారనే ఆరోపణ ఉంది. దీనిపై జిల్లా కలెక్టరేట్లోని హౌసింగ్ పీడీ కార్యాలయంలో అధికారులు సమీక్షించారు. ఇసుక గోల్ మాల్ పై చర్చ సందర్భంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు శ్రీహరి, రమేష్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంలోనే రమేష్ నాయక్ పై అధికారుల సమక్షంలోనే శ్రీహరి దాడికి యత్నించాడు. శ్రీహరి ఇసుక గోల్ మాల్ వ్యవహారం బయటికి రావడంతోనే తనపై దాడి చేశారని రమేష్ నాయక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన వర్క్ ఇన్స్పెక్టర్కే అధికారులు వత్తాసు పలికారని రమేష్ వాపోయాడు. తనకు జరిగిన అవమానం భరించలేక కలెక్టరేట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పెట్రోల్ సీసాను లాగేసుకుని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై రమేష్ నాయక్ దంపతులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.