ఎస్​ఐపై తీవ్ర ఆరోపణలు - న్యాయం కోరుతూ పెట్రోల్​ బాటిల్​తో మహిళల నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

Women Protest in Front of DSP Office : తమకు న్యాయం జరగలేదంటూ పెనుకొండ డీఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్​ బాటిల్​తో మహిళలు నిరసన తెలిపారు. యు.రంగాపురం గ్రామస్థులు మడకశిర ఎస్సై లోకేశ్ పై ఎస్సీకి ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబరు 23న గ్రామంలో జరిగిన ఘర్షణలోకి ఎస్సై జోక్యం చేసుకొని వారిపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. దాదాపు 18 మందిని అరెస్ట్​ చేశారని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు, పెద్దలు అనే భేదం లేకుండా వారిని చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు.

Women Who Asked For Justice : తమపై కేసులుండవంటూ నగదు వసూలు చేసి రిమాండ్​కి పంపించారని రంగాపురం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా వైసీపీ పార్టీలో చేరితే తమపై ఉన్న కేసులు లేకుండా చేస్తానని ఎస్సై లోకేశ్​ బెదిరించినట్లు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఎమ్మెల్యే తిప్పేస్వామి తొత్తుగా పనిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలియజేశారు. తమకు సీఐ, ఎస్సై అధికారుల ద్వారా న్యాయం జరగలేదని వాపోయారు. వారికి ఎస్పీ, డీఎస్పీ అధికారుల ద్యారానే న్యాయం జరుగుతుందని ఆశించి వారి కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.