పెద్ద మనసు చాటుకున్న దీదీ.. 'అతడి'ని సొంతకారులో ఆస్పత్రికి పంపించి.. - అనారోగ్య జర్నలిస్టుకు సీఎం మమతా బెనర్జీ సాయం
🎬 Watch Now: Feature Video
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో కిందపడ్డ ఫొటో జర్నలిస్ట్‌ను తన సొంతకారులో ఆసుపత్రికి తరలించారు. గురువారం బంగాల్ రాజధాని కోల్‌కాతాలో రెజర్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న క్యాండిల్ ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తలు కవర్ చేస్తుండగా.. ఫొటో జర్నలిస్ట్ సుభ్రాంశు ఒక్కసారిగా కిందపడ్డాడు. వెంటనే స్పందించిన సీఎం మమత.. అతడికి నీళ్ల బాటిల్ అందించారు. అనంతరం తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సెక్యూరిటీ బైక్‌పై వెళ్లిపోయారు. ఫొటో జర్నలిస్ట్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు.. ఆసుపత్రికి సైతం వెళ్లారు మమతా బెనర్జీ.
అంతకు ముందు రెజ్లర్లకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడిన మమతా.. బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసు నమోదు చేయాలన్నారు. కేవలం ఆయన రాజీనామా చేస్తే సరిపోదని.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటాన్ని కొనసాగించాలని రెజర్లకు దీదీ సూచించారు. తమ జీవితాలు, స్వాతంత్ర్యం కోసం ఈ పోరాటం చేయాలన్నారు.