We Stand with CBN Programme in Kuwait : 'చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా విడుదలవుతారు' - చంద్రబాబు అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 6:49 PM IST
We Stand with CBN Programme in Kuwait : ఎన్నారై టీడీపీ కువైట్, జనసేన కువైట్ సంయుక్తంగా "వీ స్టేండ్ విత్ సీబీఎన్" అనే కార్యక్రమాన్ని ఫర్వానియాలో ఉన్న ద్వైహి ప్యాలస్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐడీ అరెస్టు చేసి గత 12 రోజులుగా రిమాండ్ పేరిట రాజమండ్రి జైల్లో ఉంచి.. జగన్ ప్రభుత్వం తీర్చుకుంటున్న కక్షపూరిత చర్యలను ముక్తకంటంతో ఖండించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటిచేసి సైకో పాలనకు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబు(Chandrababu) దేశంలోనే ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా బయటకు రావాని అందరు ఆకాంక్షించారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి, జగన్ పోవాలి - పాలన మారాలి, ఐ యాం విత్ సీబీఎన్ అనే నినాదాలతో హోరెత్తించారు.
TDP Followers We Stand with CBN Programme in Kuwait : ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కుదరవల్లి సుధాకర రావు, నాగేంద్రబాబు అక్కిలి, ఈశ్వర్ నాయుడు మద్దిన, బాలకృష్ణ, షేక్ బాషా, దుగ్గి శ్రీనివాస్, కొల్లి ఆంజనేయులు, వంశీ, నరేష్, శివ, చిన్నబాబు గున్న, విసి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గాజులపల్లి, బాలరెడ్డయ్య, గూదే శంకర్, రమేష్, సుబ్బ రాజుదొడ్డి పల్లి, కోడూరి మహేష్ గౌడ్, విజయ్ కుమార్ పసుపులేటి, బొమ్ము నరసింహులు, రషీదా.. జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, కోనసీమ రాజేష్, దండు వేణు, శేఖర్, బిరడా సూర్యనారాయణ, ఇమ్మిడిశెట్టి సూర్యనారాయణ, ఓబులేసు, మర్రి రెడ్డయ్య, ధరణి నాగ రాయల్.. కువైట్ మహాసేన నాయకులు రాపాక రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.