Wall posters against MLA Bolla: 'జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..' వాల్ పోస్టర్ల కలకలం - Ycp
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2023/640-480-19187867-259-19187867-1691221286458.jpg)
Wall posters against MLA Bolla Brahmanaidu in Vinukonda: 'జగనన్న ముద్దు.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. ఇట్లు వినుకొండ నియోజకవర్గం ప్రజలు' అంటూ శనివారం వినుకొండ లోని పలు ప్రాంతాల్లో వెలసిన వాల్ పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం ఏ స్థాయిలో ఉందనేది ఈ వాల్ పోస్టర్లతో తేటతెల్లమవుతోంది. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వ్యతిరేక వర్గం.. గతంలో పలుమార్లు ఆయన ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు వేయగా.. పోలీసులతో వాటిని తొలగించారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులను గాలికి వదిలేశారని, అభివృద్ధి చేయకుండానే అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై ఆరోపణలున్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి, అక్రమాలతో వందల కోట్లు దోచుకుంటున్నారని... ప్రశ్నించిన వైసీపీ నేతలపైనా కేసులు పెట్టిస్తున్నారని అసమ్మతి వర్గం వాదన. కాగా, అహంకారం, కవింపు చర్యలతో ప్రతిపక్షాలపై దాడులు, తప్పుడు కేసులు పెట్టిస్తూ నియోజవర్గ ప్రజల్లో టీడీపీపై సానుభూతి పెరిగేందుకు దోహదం చేయడంతోపాటు, వైసీపీని ప్రజల్లో డ్యామేజి చేస్తున్నాడని బొల్లా వ్యతిరేక వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి వర్గీయులు.. వైసీపీకి జరుగుతున్న నష్టంపై రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వినుకొండలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయని ప్రచారం.