''ఈనాడు-ఈటీవీ'' ఆధ్వర్యంలో ఓటరు నమోదు చైతన్య అవగాహనా సదస్సు - ఏపీ ఓటరు జాబితా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 2:07 PM IST
Voter Registration Campaign at Vijayawada: ''ఈనాడు-ఈటీవీ'' సంయుక్తంగా విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఓటరు నమోదు చైతన్య అవగాహనా సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ రత్నప్రసాద్తో పాటు ఇతర సిబ్బంది, విద్యార్థులు ఈనాడు- ఈటీవీ యూనిట్ ఉద్యోగులు హాజరయ్యారు. ఓటరు నమోదు చైతన్యం అవగాహనా సదస్సులో భాగంగా ఓటు హక్కు నమోదు, ఆవశ్యకత తదితర అంశాలపై వక్తలు వివరించారు. దీంతో 18 ఏళ్ల వయసున్న విద్యార్థులంతా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఆసక్తి చూపారు.
ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఓటరు నమోదుపై యువ విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిన ఫాం-6 తో పాటు ఇతర అంశాలపైనా సందేహలను నివృత్తి చేసుకున్నారు. ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొని వాలంటీర్లుగా చక్కని సేవలు అందించి తమ తోటి విద్యార్థులను నూతన ఓటర్లుగా నమోదు చేశారు.