రసాభాసగా సర్వసభ్య సమావేశం - వాలంటీర్ల తీరుపై వైసీపీ సర్పంచులు,ఎంపీటీసీల ఆక్రోశం - Volunteers Not Listen YCP Sarpanchs And MPTCs

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 8:54 AM IST

Volunteers Not Listen YCP Sarpanchs And MPTCs In Prakasam District: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. గ్రామాల్లో సర్పంచులుగా తాము ఎందుకు ఉంటున్నామో అర్ధం కావడం లేదంటూ వైసీపీ సర్పంచులు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తమకు అసలు విలువ లేదంటూ.. వాలంటీర్లు కూడా తమ మాట వినే పరిస్థితి లేదంటూ సమావేశంలో అసంతృప్తి చెందారు. గ్రామాల్లో తమకు తెలియకుండానే అన్ని పనులు జరుగుతున్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అడిగే ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు ఎక్కడా అంటూ సంబంధిత అధికారులను గ్రామ సర్పంచులు నిలదీశారు. టీడీపీ సర్పంచులు ఉన్న గ్రామాల్లో వారి తీర్మానాలు లేకుండా పనులు చేయడంపై ఎంపీపీ పెద్ద గురవయ్య సభ్యులు నిలదీశారు. సర్పంచులు, ఎంపీటీసీలు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి తమ వద్ద నిధులు లేవని ఎంపీడీఓ (Mandal Parishad Development Officer), ఎంపీపీలు సమాధానాలు ఇస్తుండటం గమనార్హమన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.