Visakha GVMC Outsourcing Workers Protest : జీవీఎంసీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా.. జీతాలు పెంచాలని డిమాండ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2023, 4:32 PM IST
Visakha GVMC Outsourcing Workers Protest : విశాఖపట్నంలోని జీవీఎంసీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆందోళనలు చేపట్టారు. మంచి నీటి సరఫరా, పారిశుద్ద్యం, ఇంజనీరింగ్ ఇతర విభాగాలలోని ఈ ఉద్యోగులు ఉదయం నుంచి సమ్మెలో పాల్గోని తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఉదయం నుంచి విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరా టాంకర్లను, చెత్త సేకరణ వాహనాలను నిలిపివేసి మరి నిరసనను వ్యక్తం చేశారు. వేతనం పెంపు, సమాన పనికి సమాన వేతనం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ధర్నా నిర్వహించారు.
స్కిల్డ్ ఎంప్లాయిస్గా ఉన్న తమని అన్ స్కిల్డ్ ఎంప్లాయిస్గా మార్చి వేతనాలు తగ్గించారని కొందరు కార్మికులు ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలు తమకు రావటం లేదని వాపోయారు. వెంటనే స్కిల్డ్ ఎంప్లాయిస్గా గుర్తించాలని, ఇంతకు ముందు ఇచ్చిన వేతనాలను తిరిగి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని.. లేకపోతే సమ్మెను ఇలానే కొనసాగిస్తాం అని హెచ్చరించారు.