Visakha Coast Guard Rescue Tamil Nadu Fishermen at Sea: సముద్రంలో చిక్కుకున్న బోటు.. తమిళనాడు మత్స్యకారులను కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్స్ - చేపల వేడ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 3:49 PM IST
Visakha Coast Guard Rescues 10 Tamil Nadu Fishermen from Sea: చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి.. సముద్రం మధ్యలో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన మత్స్యకారులను(Tamil Nadu Fishermen ) విశాఖ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. తమిళనాడు నుంచి బయలుదేరిన వారి బోటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్టు వైపు వచ్చింది. అయితే, సముద్రం మధ్యలో ఉండగా తమిళనాడుకు చెందిన బోటులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కంగారు పడ్డ మత్స్యకారులకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటికే తమిళనాడు తీరానికి దూరంగా విశాఖ తీరాని దగ్గరగా ఉన్నామని అర్థం అయ్యింది.
విశాఖలో ఉన్న కోస్ట్ గార్డుకు సహాయం కోరుతూ మత్స్యకారులు.. సమాచారం అందించారు. వెంటనే స్పందించిన విశాఖ కోస్ట్ గార్డ్స్(Visakha Coast Guards) బోటును తీరానికి చేర్చేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. కోస్ట్ గార్డ్, నౌక సహాయక చర్యలతో తమిళనాడుకు చెందిన బోట్, మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేరారు. నిలిచిపోయిన బోటులో 10 మంది మత్స్యకారులున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్ సకాలంలో స్పందించి తమకు సహాయం చేశారని మత్స్యకారులు తెలిపారు.