Road Construction: ప్రభుత్వంతో పని లేకుండా రోడ్డు నిర్మించుకున్న గ్రామస్థులు.. ఎక్కడంటే..!
🎬 Watch Now: Feature Video
Villagers built the road with their own funds: ఆ దారి శిథిలమయ్యి ఏళ్లు గడుస్తోంది. దానిని ఆధునీకరించే దిశగా ఎవరూ పట్టించుకోలేదు. దీని కారణంగా రాకపోకలకు నిత్యం ఇబ్బంది పడుతున్న రైతులు, ప్రజలు ఒకరికొకరు చేతులు కలిపారు. లయన్స్ క్లబ్ సహకారాన్ని అందుకున్నారు. ఇంకేముంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా రోడ్డును నిర్మించుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గడేకల్లు - జనార్దనపల్లి గ్రామాల మధ్య ఆరు కిలో మీటర్ల మేర రోడ్డును గ్రామస్థులు శ్రమదానం చేసి నిర్మించుకున్నారు. మట్టి దారి కావడంతో పూర్తిగా శిథిలమైపోవడంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రోడ్డు వేయమని పలుమార్లు అధికారుల వద్ద మొర పెట్టుకున్న పట్టించుకోకపోవడంతో.. రైతులు, ప్రజలు ఒకరికొకరు చేతులు కలిపారు. లయన్స్ క్లబ్ సహకారంతో 20 రోజుల పాటు శ్రమించి రోడ్డు వేసుకున్నారు. ఆరు కిలో మీటర్లు మేర ఎర్రమట్టిని తోలించి, డోజర్‌తో చదును చేయించారు. రోజుకు సగటున లక్షన్నర ఖర్చు అయినట్లు రైతులు తెలిపారు. మొత్తం నిర్మాణానికి లయన్స్ క్లబ్‌తో కలిసి 30 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు వివరించారు.