తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు - cm chandrababu tirumala tour
🎬 Watch Now: Feature Video
Chandrababu in Tirumala Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేసి, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం, వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
దర్శనానంతరం రంగనాయక మండపంలో సీఎం దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేష వస్త్రం, చిత్రపటాలు, తీర్థప్రసాదాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు అందజేశారు. తిరుమల వచ్చేవారు నిబంధనలు పాటించాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్న తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు.