WOMENS T20 WORLD CUP 2024 India Women vs New Zealand : మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన మన అమ్మాయిల జట్టు తొలి మ్యాచ్‌లోనే తుస్సు మనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సేన టోర్నీని ఘోర పరాజయంతో ప్రారంభించింది. న్యూజిలాండ్‌పై మనకున్న పేలవ రికార్డును కొనసాగించింది. ఆ జట్టు చేతిలో మరోసారి ఓడిపోయి క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది.
సెమీస్ అవకాశాలపై పెద్ద దెబ్బే : ఈ పోరులో ఓటమి తేడా ఎక్కువ ఉండటం వల్ల భారత జట్టు సెమీస్ అవకాశాలకు పెద్ద దెబ్బే పడినట్టైంది. ఆడింది ఒక్క మ్యాచే, ఓటమి ఒక్కటే అయినా భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఎందుకంటే? - గ్రూప్-ఎలో ఉన్న జట్లలో ఏదీ తేలికైన జట్టు కాకపోవడమే.
ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో గ్రూప్ నుంచి సెమీస్‌కు అర్హత సాధిస్తుందని అంచనా ఉంది. ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్ కాస్త బలహీనమైన జట్లు కాబట్టి భారత్, న్యూజిలాండ్‌ల్లో ఒకటి సెమీస్ చేరొచ్చని విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో ముఖాముఖి జరిగిన మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సెమీస్ బెర్త్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడేమో న్యూజిలాండ్ భారత జట్టును భారీ తేడాతో ఓడించి తన సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది.
India Women Semifinal : కాబట్టి మన అమ్మాయిల జట్టు ఇప్పుడు మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే ముందంజ వేయగలదు. పైగా న్యూజిలాండ్ చేతిలోనే ఇంత దారుణంగా ఓడిన భారత జట్టు, ఆస్ట్రేలియాను ఓడించడం అంత తేలికేమీ పని కాదు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లోనూ భారత్ ఓడితే, మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో కచ్చితంగా గెలవాలి. ఇదే సమయంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో జట్టు చేతిలోనూ ఓడిపోవాలి. అలానే పాకిస్థాన్, బంగ్లాదేశ్ సంచలనాలు సృష్టించాలి. అప్పుడే సమీకరణాలు మారుతాయి. చూడాలి మరి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో.
న్యూజిలాండ్‌తో పోరు - తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి - Womens T20 World Cup 2024
కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ధరించే సన్ గ్లాసెస్ ధర అంతా? - Kohli Oakley sunglasses Price