ETV Bharat / entertainment

నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం - Actor Rajendra Prasad - ACTOR RAJENDRA PRASAD

టాలీవుడ్​ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం

source ETV Bharat
Actor Rajendra Prasad (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 6:40 AM IST

Updated : Oct 5, 2024, 6:48 AM IST

Actor Rajendra Prasad Daughter Gayatri passed away : టాలీవుడ్​ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‌ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Rajendra Prasad Comments on His Daughter : నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్ర ప్రసాద్​, మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కామెడీ హీరోగా మెప్పించారు. ఎన్నో సూపర్​ హిట్​ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా రాణిస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ పరసనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదు.

ఓ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. బేవార్స్ అనే సినిమా ఈవెంట్‌లో తన కుమార్తె గురించి మాట్లాడుతూ, అమ్మ లేని వారు కూతురిలో వారి అమ్మను చూసుకుంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని చెప్పుకొచ్చారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన 'తల్లి తల్లి నా చిట్టి తల్లి' అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఆ సాంగ్​ను గాయత్రికి ఎన్నో సార్లు వినిపించినట్లు తెలిపారు. అప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం అని తెలిసింది. ఈ విషయాన్ని రాజేంద్రప్రసాదే స్వయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

సెన్సేషనల్​ డైరెక్టర్​తో షారుక్ ఖాన్ కొత్త సినిమా​ - సాహసికుడుగా బాద్​షా! - Sharukh Khan New Movie

ప్రభాస్​ 'రాజాసాబ్​'కు గుమ్మడికాయ కొట్టేది అప్పుడే! - Rajasaab Shooting Update

Last Updated : Oct 5, 2024, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.