ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నానని కేశినేని నాని ప్రకటన - tdp leader Resigns
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 9:28 AM IST
|Updated : Jan 6, 2024, 9:34 AM IST
Vijayawada MP Kesineni Nani Announce will Resigns : తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ (X) వేదికగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌పై ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం అధిష్టానం స్పష్టత ఇచ్చింది. బెజవాడ ఎంపీ టిక్కెట్టును ఈ సారి వేరే వారికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయాన్ని ఎంపీ కేశినేని నాని నిన్న తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి, ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ (X) వేదికగా వెల్లడించారు. "చంద్రబాబు నాయుడు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన, కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను" అని ట్విటర్ వేదికగా కేశినేని నాని పేర్కొన్నారు.