Ambati Rayudu on political entry: నేను ఏ పార్టీలోనూ చేరలేదు..సమాజ అధ్యయనంపై దృష్టి: అంబటి రాయుడు - క్రికెట్ అభివృద్ధి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2023, 9:26 PM IST

Rayudu inspected Akshaya Patra's kitchen: తాను ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను రాయుడు పరిశీలించారు. అక్షయపాత్రలో వంట తయారీని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందని రాయుడు చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనన్న రాయుడు.. ప్రస్తుతం తన దృష్టంతా సమాజ అధ్యయనంపైనే ఉందన్నారు. రాష్ట్రం తరఫున ఐపీఎల్ జట్టుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. క్రికెట్ అభివృద్ధికి అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. అక్షయ పాత్ర వంటశాలను తాను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దాదాపు 22లక్షల మంది విద్యార్థులకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం అందించడం చాలా గొప్ప విషయం అని రాయుడు అన్నారు. రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి కూడా ఇదే కిచెన్ నుంచి భోజనం అందించడం చాలా బాగుంది... చాలా టాప్ క్లాస్ కిచెన్.. సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి అని తెలిపారు.. తాను ఇప్పటి వరకూ ఏ పార్టీలోనూ చేరలేదని, సమాజ సేవ చేసే  వ్యక్తులు, సంస్థలను కలుస్తున్నానని చెప్తూ.. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడికి వచ్చాను" అని అంబటి రాయుడు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.